వాంఖడే…సచిన్‌కు నిలువెత్తు విగ్రహం

13
- Advertisement -

భారత క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు తర్వాత అత్యంత అరుదైన గౌరవం అందుకోబోతున్న ఆటగాడిగా లిటిల్ మాస్టర్‌ సచిన్ రమేష్ టెండూల్కర్ నిలిచారు. ప్రఖ్యాత ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తన నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ముంబై క్రికెట్‌ ఆసోసియేషన్(ఎమ్‌సీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే మంగళవారం ప్రకటించారు. 2013నాటి వరల్డ్ కప్ ఫైనల్‌ వాంఖేడే స్టేడియంలో నిర్వహించగా…భారత్ ప్రపంచ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే 2023నాటి ప్రపంచ కప్‌ ప్రారంభమయ్యే నాటికి ఈ విగ్రహం ప్రతిష్టించనున్నారు.

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ… వాంఖడే స్టేడియం తనకు ఎంతో ప్రత్యేకం అని అన్నారు. తన తొలి రంజీ మ్యాచ్‌ ఆఖరి ఇంటర్‌నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఇదే వేదికపై ఆడానని తెలిపారు. ఆటలో నాకు 25 ఏళ్ల అనుభవం ఉన్నా నేను 25 ఏళ్ల వాడిలా ఉన్నా. అందుకు నేను ఎంసీఏకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వాంఖడేలో నా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎంసీఏ నాకు సమాచారం ఇచ్చింది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం. అందుకే విగ్రహం ఎలా ఉండాలి..? స్టేడియంలోని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయాలి..? అనే అంశాలపై చర్చించేందుకు మంగళవారం వాంఖడేకు వచ్చా. ఇలాంటి సందర్భాలు అత్యంత అరుదుగా వస్తాయి’ అని సచిన్‌ వ్యాఖ్యానించాడు.

తొలి టెస్టు జట్టు కెప్టెన్ సీకే నాయుడుకు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని మూడు స్టేడియాల్లో వేర్వేరు సైజుల్లో విగ్రహాలను ఏర్పాటు చేశాయి. ఇందౌర్‌లోని హోల్కర్ స్టేడియం నాగ్‌పూర్‌లోని విదర్భ మైదానం ఆంధ్రప్రదేశ్‌లోని వీడీసీఏ స్టేడియాల్లో సీకే నాయుడు విగ్రహాలు ఉన్నాయి. కాగా సచిన్ రెండో వ్యక్తి కానున్నారు.

ఇవి కూడా చదవండి…

మార్చిలో బ్యాంకులకు 12 రోజులు హాలిడేస్..

తగ్గిన పసిడి ధరలు..

ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్‌..

- Advertisement -