ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా ప్రభుత్వం దివాలా తీసిందని కేంద్రమంత్రి దేవ్‌సింహ్‌చౌహాన్ విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని వాసవీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మద్యం ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఆ ఆదాయమంతా ఎక్కడికి పోతోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లు మీద ఉన్నారని వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. 10వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతుయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విట్టా రమేశ్, పార్థసారథి జిల్లా అధ్యక్షుడు రామస్వామి మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌జైన్ పాల్గొన్నారు. నిజానికి కేంద్రంలోని బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపాకు ఈ మధ్య దూరం పెరిగినట్టుగా తెలిసివస్తోంది. తెదేపా నుంచి జనసేన పొత్తు పెట్టుకుంట్టే… జనసేన బీజేపీకి దూరమవుతుంది. ఒకవేళ తేదేపా, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే జగన్ సర్కార్‌కు కొంతవరకు రాజకీయంగా నష్టపోవాల్సి వస్తోంది.
ఇవి కూడా చదవండి…