దొందు దొందే…సీఎం కేసీఆర్‌

45
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ పద్దులపై చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్‌ కేంద్రంపై మండిపడ్డారు. ఎన్నికలప్పుడు నాయకులు గెలుస్తున్నారు. ప్రజలు ఓడిపోతున్నారని అన్నారు. ఈ సందర్బంగా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం ఇస్తూ తనదైన శైలిలో సీఎం కేసీఆర్‌ కేంద్రంలోని బీజేపీ విపక్ష పార్టీయైన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఈసందర్భంగా రెండు పార్టీలు దొందు దొందే అని సంభోదించారు. ఒకరిపై మరొకరు విమర్శించుకోవడం తప్ప ప్రజలకు ఏం చేసారో కేంద్రం చెప్పలేదన్నారు.

2004-2014 కాంగ్రెస్‌ దేశాన్ని నాశనం చేసిందన్నారు. వీళ్ల తర్వాత వచ్చిన బీజేపీ ఏమైనా చేస్తాదా అనుకుంటే ఏం చేయలేదు. చేయకపోగా ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటూ పోతున్రు అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు పూజా మెహ్రా రాసిన ది లాస్ట్‌ డికేడ్ అనే పుస్తకం రాశారు. పది సంవత్సరాల మోదీ మన్మోహన్‌సింగ్ పాలనలో ఏం జరిగిందో వివరించారు.

కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. చాలా చిత్రవిచిత్రమైన పోకడలు, వింత వింత ధోరణలు చూస్తున్నాం. ఎందుకు జరుగుతున్నయ్‌? అని ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ప్రజాస్వామ్య, జాతి నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాలని ప్రార్థిస్తున్నా. దేశంలో చెలరేగుతున్న ధోరణులు, ప్రజల ఆలోచనలు, నెరవేర్చుతున్న, నెరవేర్చబడుతున్న, మిగిలిపోయిన ప్రజల ఆకాంక్షలు, ఆశలు.. మధ్య మధ్యలో చెలరేగే ప్రజల ఆకోశ్రాలు వీటన్నింటి సమహారంగా ప్రజాజీవితంలో ధీర్ఘమైన, తీవ్రమైన చర్చ జరపాల్సి ఉంది. అలాంటి చర్చలకు వేదికనే దేవాలయంలాంటి శాసనసభ అని అన్నారు.

దురదృష్టవశాత్తు జబ్బలు చరుచుకుంటూ సబ్జెక్ట్‌ వదిలి మరోటి మాట్లాడుతారు. రకరకాల పెడధోరణులు శాసనసభలో, పార్లమెంట్‌లో కనిపించడం బాధాకరమన్నారు. దేశం విడిచిపెట్టి ప్రజలు నేటి వరకు 20లక్షల మంది భారతీయులు సిటిజన్ షిప్‌ను వదులుకోవడం చాలా సిగ్గుచేటన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితులను ఎవరు కల్పించారు అని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి…

బస్తీ దవాఖానాలో 134రకాల పరీక్షలు

14న కొండగట్టుకు కేసీఆర్..

21 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతి..

- Advertisement -