ఫిబ్రవరి 14 అనగానే గుర్తుకువచ్చేది ప్రేమికుల రోజు. అలాంటి ప్రేమికుల రోజుకు ఒక వింతైన అనుభవం ఎదురుకాబోతుందా అంటే..ఎమో తెలియదు. ఎందుకంటే హిందూ భావజాలం కలిగిన వ్యక్తులు ప్రేమికుల రోజున ఎవరైనా జంట కనిపిస్తే పెళ్లి చేసేస్తారు. అయితే ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకంటే..బీహార్ ఉపముఖ్యమంత్రికి ఒక చేదు అనుభవం జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా వైరల్‌అవుతుంది. బీహార్కు చెందిన పింకీ అనే యువతి ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు లేఖ రాసింది. ఈ లేఖలో తన మనోవేదనలను ప్రస్తావించింది. పాట్నా అమ్మాయి పింకీ లేఖలో తను లవ్‌లో ఉన్నట్టు రాసుకొచ్చింది.
టీవీ డైలీ సోప్ ఒపెరా స్క్రీన్ రైటర్ అయినా ప్రభాత్ బంధుల్యాతో తాను ప్రేమలో ఉన్నానని పింకీ వెల్లడించింది. తన నిరుద్యోగ స్థితి కారణంగా వాలెంటైన్స్ డే రోజున తనని కలవలేకపోతున్నాని వాపోయింది. నాకు చాలా టెన్షన్‌గా ఉంది. అది నీకు కూడా తెలుసు. నువ్వు ప్రేమ వివాహం చేసుకున్నావు. కానీ నా పెళ్లి మాత్రం నిరుద్యోగ సమస్యతో వెంటాడుతోంది. ప్రభాత్ బంధుల్యాతో నాకు నాలుగేళ్లగా ప్రేమించుకుంటున్నాము. ఈ సమయంలో అఫైర్స్ ఉండే వయసులో కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను నాకు ఉద్యోగం వస్తే నేను ప్రపోజ్ చేద్దామనుకుంటున్నా కానీ నాకు ఉద్యోగం రావట్లేదు.
పరిస్థితిని చూస్తే ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే గడిచిపోతుంది. నేను పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నాను. కానీ మా నాన్న నా పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇవన్నీ ఆలోచిస్తూ నేను కలత చెందుతున్నాను. ఎన్నో ఆశలతో ఈ ఉత్తరం రాస్తున్నాను. దయచేసి నాకు ఉద్యోగం ఇప్పించండి. లేకపోతే ప్రభాత్ మరొకరితో పెళ్లి చేసుకుంటాడు. నాకు ఉద్యోగం లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అవుతాను? మీ ఓటరు మరియు ప్రభాత్ ప్రేమికురాలిని పింకీ అని ఆమె లేఖను ముగించింది.
महादेव कसम ! पिंकी ने हमको फेमस कर दिया यार . शुक्रिया ! मैं प्रयास करूंगा कि @yadavtejashwi जी से मेरी मुलाक़ात हो और इस विषय पर संवाद करूँ .
— Prabhat Bandhulya (@pbandhulya) February 8, 2023
ఇవి కూడా చదవండి…