వైద్యరంగం మరింత బలోపేతం..

17
- Advertisement -

తెలంగాణలో వైద్యరంగం మరింత బలోపేతం అవుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మెడికల్‌ కాలేజీలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌ రావు సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నదని, కానీ రాష్ట్రానికి మాత్రం ఒక్క కాలేజీని కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో 3 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, తాము ఒక్క ఏడాదిలోనే 8 వైద్య కళాశాలలు ప్రారంభించామన్నారు. నాడు 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత 2790కి పెంచుకున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి ఎయిమ్స్‌ మంజూరు చేశారు. అక్కడ వసతులు లేవని విమర్శించారు.

జిల్లాకు మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని చెప్పారు. ప్రతి జిల్లాలో నర్సింగ్‌ కాలేజీ, పారామెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారామెడికల్‌ కాలేజీల్లో అనేక కోర్సులు ప్రవేశపెడుతున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -