21 వేలు దాటిన మృతుల సంఖ్య

40
- Advertisement -

టర్కీ, సిరియాలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు అందరిని కలచివేస్తున్నాయి. రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 21 వేలు దాటాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వేలాది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత్‌కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. ఈ బృందాలు ఆరేళ్ల బాలికను భవన శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ చలి తీవ్రతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు భూకంపం సంభవించి నాలుగు రోజులు అవుతుండటంతో శిథిలాల కింద చిక్కుకున్నవారు బతికే అవకాశాలు చాలా తక్కువని అధికారులు అంచనా వేస్తున్నారు. భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ మూడు బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కోసం టర్కీకి చేరుకున్నాయి. క్షతగాత్రులకు నిరంతరం వైద్య చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -