అదానీ పతనం.. ప్రజలకు పెను భారమే!

77
- Advertisement -

మనదేశంలో అత్యంత సంపన్నుడిగా వెలుగొందిన ఆధానీ గ్రూప్ చైర్మెన్, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆధానీ గత కొన్నిరోజులుగా గడ్డుకాలం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందేఅమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ అయిన హిండెన్ బర్గ్ ఆధానీ గ్రూప్స్ పై సంచలన ఆరోపణలు చేస్తూ.. గౌతమ్ ఆధానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందంటూ హిండెన్ బర్డ్ సంస్థ ఇటీవల ఓ నివేదికను ఫ్రూప్స్ తో సహ వెల్లడించిన సంగతి తెలిసిందే.

దీంతో ఒక్కసారిగా ఆధానీ గ్రూప్ పతనం మొదలైంది. ఈ పతనం ఎంత వేగంగా జరిగిందంటే.. ఆధానీ గ్రూప్స్ పై ఆరోపణలు వచ్చిన నాలుగు రోజుల్లోనే 84.4 బిలియన్ డాలర్లు ఉన్న ఆధానీ సంపదలో ఏకంగా 34 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. దీంతో ప్రపంచ కుబేరులలో రెండవ స్థానంలో ఉన్న ఆధానీ.. ఏకంగా టాప్ 10 నుంచి ఔట్ అవ్వడమే కాకుండా ఇంకా కిందకు పడిపోతున్నారు. దీన్ని బట్టి ఆధాని సంపద ఎంత వేగంగా అవిరవుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆధానీ పతనం దేశప్రజలపై ప్రభావం చూపనుందా అంటే అవుననే విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఆధానీ గ్రూప్స్ లో ఎల్‌ఐ‌సి వంటి ఎన్నో స్వదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.

అవన్నీ కూడా నష్టాలను చవి చూడక తప్పదు. అలాగే ఆధానీ సంపదలో అధిక శాతం ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆధానీ గ్రూప్స్ పతనం ఇలాగే కొనసాగితే.. అప్పులు చెల్లించలేని స్థితికి ఆధాని చేరుకునే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వ బ్యాంకులు తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోతాయి. ఇక కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కు మరియు గౌతమ్ ఆధానీ కి మద్య మంచి దోస్తీ ఉందనే ఆరోపణలు మొదటి నుంచి కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో ఆధానీ నష్టాలను పుడ్చేందుకు సామాన్యుడిపై మోడీ సర్కార్ ఆర్థిక భారం వేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి గౌతమ్ ఆధానీ పతనం.. దేశ ప్రజలపై గట్టిగానే ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయంలో మోడీ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

భూకంప బాధిత దేశాలకు భారత్ సాయం

టర్కీలో భారీ భూకంపం..95 మంది మృతి

తెలంగాణ పథకాలు దేశమంతా: సీఎం కేసీఆర్

- Advertisement -