- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కూకట్ పల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటారు బాల పురస్కార్ గ్రహిత గౌరవి రెడ్డి.ఈ సందర్భంగా గౌరవి రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఇప్పుడున్న కాలుష్యాన్ని నివారించాలి అంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాల్సిన బాధ్యత మన మీద ఉందని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే తప్పకుండా వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు. ఈ అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సౌమ్య, తన్వీ, హుస్నా వీరి ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -