మన దేహానికి కళ్ళు ద్వారం లాంటివాని అందరికీ తెలిసిందే. అందుకే శరీరంలో ఎన్ని భాగాలు ఉన్న కళ్ళకు ఉండే ప్రత్యేకత వేరు. సమస్తన్ని స్పష్టంగా చూపించేది కళ్ళు మాత్రమే కాబట్టి కళ్లను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాగా కళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వివిధ రకాల ఆకుకూరలు, విటమిన్ ఏ కలిగిన పదార్థాలను అధికంగా తీసుకుంటూ ఉంటాము. అయితే కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో యోగా కూడా చాలా చక్కగా ఉపయోగ పడుతుంది.
యోగలోని మత్స్యాసనం కళ్ళకు రక్త రక్త ప్రసరణ సవ్యంగా జరిగేలా చూస్తుంది. అంతే కాకుండా కంటి చూపును పెంచడంలో కూడా ఈ ఆసనం ఉపయోగ పడుతుంది. అయితే ఈ ఆసనం వేయడం వల్ల కేవలం కళ్ల విషయంలో మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఆసనం తరచూ వేయడం వల్ల ఊపిరితిత్తుల మరియు కడుపు సంబంధిత వ్యాధులకు దూరం చేస్తుంది. మలబద్దకనికి చెక్ పెడుతుంది. ఫలితంగా ప్రేగులలోని మలినం దూరమౌతుంది.శరీర భాగాలకు రక్త ప్రసరణ యొక్క వేగం అధికం అవుతుంది. మెడ భాగంలోని నొప్పులను నివారిస్తుంది. దగ్గు, ఉబ్బసం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతే కాకుండా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు ను కరిగించడంలో కూడా మత్స్యాసనం ఎంతగానో ఉపయోగ పడుతుంది.
మత్స్యాసనం వేయు విధానం
ముందుగా చదునైన నేలపై దుప్పటి లేదా యోగా షీట్ వేసుకొని దానిపై పద్మాసనం వేసి నిటారుగా కూర్చోవాలి. తర్వాత కళ్లను పద్మాసనం స్థితిలోనే ఉంచి చేతుల ఆధారంతో వెనుకవైపుకు పడుకోవాలి.; ఆ తరువాత నడుము భాగాన్ని పైకి లేపి, మోకాళ్ళు, పిరుదులు మరియు తలజుట్టు స్థానములను భూమికి ఆనించాలి. ఇలా చేసిన తరువాత ఎడమ చేతితో కుడికాలి బ్రోటనవేలును అలాగే కుడి చేతితో ఎడమకాలి బ్రోటన వేలును పట్టుకోవాలి. రెండు మోచేతులను నేలకు ఆనించి ఫోటోలో చూపిన విధంగా చేయాలి. ఇలా ఐదు నిముషాల నుంచి 30 నిముషాల వరకు ఈ ఆసనం అభ్యాసం చేయాలి.
ఇవి కూడా చదవండి..