కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పారు ఎంపీ రాహుల్ గాంధీ. పార్టీ సీనియర్ లీడర్ ఇలా మాట్లాడటం సరికాదు. దీనికి నేను క్షమాపణ చెబుతున్నా అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఆయన చేసిన కామెంట్లు పర్సనల్‌గానే చూడాలి. పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇండియన్ ఆర్మీపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉందని…. దిగ్విజయ్ అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పారు.
సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఆర్మీ ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇండియన్ ఆర్మీ ఏం చేసినా పక్కా ప్లానింగ్‌తో చేస్తుందని, అంతటి సమర్థత మన ఆర్మీకే ఉందని తెలిపారు. కాంగ్రెస్.. డెమొక్రటిక్ పార్టీ….పార్టీ విధానాలు ఎవరిపైనా బలవంతంగా రుద్దం అని చెప్పారు.
భారత్ జోడో యాత్రలో యాక్టర్, పొలిటీషియన్ ఊర్మిళ మటోండ్కర్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
ఇవి కూడా చదవండి..