టీబీ ఆసుపత్రిలో మొక్కలు నాటిన డా.అనిత

28
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటి ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఎర్రగడ్డలోని టీబీ చెస్ట్ మరియు జనరల్ ఆసుపత్రిలో లైవ్ తోరాసిక్ వర్క్‌షాప్ సందర్భంగా డా. అనితా బల్లా మొక్కలు నాటారు.

ఈసందర్భంగా అనితా బల్లా మరియు అవినాష్ దళి మాట్లాడుతూ…గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడున్న కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో గొప్పదని రేపటి తరాలకు చాలా అవసరమన్నారు. ఈ భూమి మనకు ఎంతో ఇస్తుంది. తిరిగి మనం మంచి కాలుష్య రహిత వాతావరణాన్ని ఇవ్వడం బాధ్యత అన్నారు.

ఆసుపత్రి ఆవరణలో వర్క్‌షాప్‌కి విచ్చేసిన డాక్టర్స్‌ అందరూ భాగస్వామ్యంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అవినాష్ డాక్టర్ రవీంద్ర డాక్టర్ నరేంద్ర నటి గాయత్రి భార్గవి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

మొక్కలు నాటిన డీసీపీ శిల్పవళ్లి…

వెల్‌కమ్‌ ఏడబ్ల్యూఎస్:కేటీఆర్‌

పుష్‌360..మోనోపాజ్ సెలవులు

- Advertisement -