మార్చిలో జరిగే మహిళా ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రముఖ మీడియాతో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ మేరకు మహిళా ఐపీఎల్ మీడియా హక్కులను వైకొమ్ 18 సంస్థ దక్కించుకొంది. వచ్చే ఐదేళ్ల కాలానికి ఈ సంస్థ మీడియా ప్రసార హక్కులను కొనుగోలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం తెలిపారు. మహిళా ఐపీఎల్ హక్కుల కోసం వైకొమ్ సంస్థ రూ.951కోట్లు పెట్టడానికి సిద్ధమైంది. అంటే ఒక మ్యాచ్‌కు రూ..7.09 కోట్లు చెల్లించనుంది.
వైకొమ్ సంస్థ 2023-2027 వరకు మహిళల ఐపీఎల్ హక్కులను బీసీసీఐ వైకొమ్18 సంస్థకు ఇచ్చింది. మార్చి 5 నుంచి 23వరకు నిర్వహించే మహిళల ఐపీఎల్ తొలి సీజన్ జరగనుంది. దీనిలో మొత్తంగా ఐదు ఫ్రాంఛైజీలు పోటీపడనున్నాయి. ఇందులో ఆడే సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న మహిళా క్రికెటర్‌లకు రూ.50లక్షలు, రూ.40 లక్షలు, రూ.30 లక్షల బేస్ ప్రైజ్ మిగతావాళ్లకు రూ.20లక్షలు రూ.10లక్షలు కనీస ధరగా నిర్ణయించింది. గతంలోనే పురుషుల జట్టుతో సమాన వేతనం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవి కూడాచదవండి…