2023ను గెలుపుతో ప్రారంభించింది టీమిండియా. ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో లంక విజయానికి 13 పరుగులు కావాల్సి ఉండగా 11 పరుగులు మాత్రమే చేశారు. దీంతో భారత్ గెలుపు ఖాయమైంది.
భారత్ విధించిన 163 పరుగుల లక్ష్యచేధనలో శ్రీలంక 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కరుణరత్నే (23 నాటౌట్), కసున్ రజిత (5) జోడీ పోరాడింది.కెప్టెన్ దసున్ శనక 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది.దీపక్ హుడా 23 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సులతో 41 పరుగులు చేయగా,అక్షర్ పటేల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 31 పరుగులు,కెప్టెన్ హార్దిక్ పాండ్య 29, ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేశారు. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 5న పుణేలో జరగనుంది.
ఇవి కూడా చదవండి..