ప్రతి గ్రామంలో కంటి పరీక్షల క్యాంపులు..

137
- Advertisement -

తెలంగాణ ప్రజల కంటి కష్టాలు దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకంను విజయవంతం చేయాలని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ జనవరి 18న ప్రారంభించనున్న రెండో విడత కంటి వెలుగు పథకంను  ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలు సహా స్థానిక సంస్థలు ఇతర ప్రజా ప్రతినిధులందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన కంటి వెలుగు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ కార్యక్రమంను బీఆర్కే భవన్ నుండి మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుండి ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పంచాయతీ, మున్సిపల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మొదటి ధపా కంటి వెలుగులో 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్ చేసి, 50 లక్షల కళ్లద్దాలు ఇవ్వడం జరిగింద‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. అదే స్ఫూర్తితో రెండో దఫా కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గ్రామ పంచాయ‌తీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం వంద వర్కింగ్ డేస్ లలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.

ఇందుకోసం కంటి వెలుగు కార్యక్రమంలో గతం కంటే టీమ్ లు పెంచిందని మంత్రి తెలిపారు. మొదటి సారి కంటి వెలుగు కార్యక్రమంలో 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపుల నిర్వహణ ఉంటుంద‌న్నారు. మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 8 మంది వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఏఎన్ఎం, ముగ్గురు ఆశా, ఒక‌ డీఈవో ఉంటారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసింద‌ని హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు.

ఈ నెల 12 లోగా అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కంటి వెలుగు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్ లోనూ పూర్తి చేసి షెడ్యూల్ పంపిణీ చేయాలన్నారు. రేషన్ షాపుల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో క్యాంప్స్ నిర్వహణ తేదీలు ప్రచురించాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్లాన్ చేసుకోవాలని, అదనపు బృందాలు సిద్దంగా ఉండాలన్నారు. ఒక‌ శాతం బఫర్ టీమ్ ( అడ్వాన్స్ టీమ్) లు పెట్టుకోవాలన్నారు. బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలనీ, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కంటి వెలుగును విజయవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని హ‌రీశ్‌రావు ఆదేశించారు. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ టీం, జిల్లాకు ఒక‌ క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని పరిశీలన చేస్తారన్నారు. 929 వైద్యులను కొత్తగా ప్రాథమిక అరోగ్య కేంద్రంలో నియమించుకున్నామని, ఇతర ఆరోగ్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని హ‌రీశ్‌రావు ఆదేశించారు. ప్రజాప్రతినిధులు చురుకైన భాగస్వామ్యంతోనే కార్యక్రమం విజయవంతం అవుతుందని సీఎం కేసీఆర్‌ ఉద్ధేశ్యం కావున.. అందరం కలిసి పనిచేసి గిన్నీస్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి…

సభలపై జగన్ కీలక నిర్ణయం….

సునీల్ కనుగోలు పిటిషన్‌..హైకోర్టు కీలక తీర్పు

దేశం కోసం బీఆర్‌ఎస్:సీఎం కేసీఆర్‌

- Advertisement -