అత్యంత పొడవైన స్కైవాక్ ఎక్కడంటే…

25
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్కైవాక్ వంతెనను భారతదేశంలో నిర్మించనున్నారు. మహారాష్ట్రలోనివ అమరావతి సమీపంలోని చిఖల్ దారా అనే హిల్‌ స్టేషన్‌లో 407మీటర్ల పొడవైన స్కైవాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కైవాక్‌ మధ్యలో 100మీటర్ల గ్లాస్ డెక్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది 2023జూలై నాటికి అందుబాటులోకి వస్తుందని సీఐడీసీవో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవేంద్ర జమ్నికర్ చెప్పారు.

ఈ నిర్మాణం పూర్తయితే స్విట్జర్లాండ్‌లోని స్కైవాక్‌ కంటే పొడవుగా 397మీటర్లు మరియు చైనాలోని 360మీటర్ల కంటే పొడవైనదిగా రికార్డు క్రియేట్ చేస్తోంది. ఇది పూర్తిగా సింగిల్ కేబుల్‌ రోప్ సస్పెన్షన్ బ్రిడ్జిగా గుర్తింపు పొందుతుందని తెలిపారు. ఇందుకోసం రూ.35కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. చిఖల్‌దారా స్కైవాక్ మెల్‌ఘాట్‌ టైగర్ రిజర్వ్‌ ప్రాంతంలోని బఫర్‌జోన్‌ మీదుగా నిర్మిస్తున్నారు.

మెల్‌ఘాట్‌ టైగర్ రిజర్వ్‌లో 900జాతుల మొక్కలు, 35జాతుల జంతువులు, మరియు 295జాతుల పక్షుల నివాసంగా గుర్తింపుపొందింది. ఇది విదర్భ ప్రాంతంలో ఉన్న ఏకైక హిల్‌ స్టేషన్‌ కాగా ముంబై-నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌వేకి దగ్గరగా ఉన్న మెల్‌ఘాట్‌ అటవీ ప్రాంతం. దీనికి రాష్ట్ర అటవీ శాఖ క్లియరెన్స్‌ ఇచ్చింది. అయితే పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి…

దేశంలో తొలి 3డీ ఇల్లు ఎక్కడంటే…

ఫోన్ పోయిందా..పేమెంట్ యాప్స్ ఇలా బ్లాక్ చేయండి!

బ్లాక్ వాటర్ తాగితే.. ఇన్ని ఉపయోగాలా?

- Advertisement -