- Advertisement -
కరోనా కొత్త వేరియంట్‌తో చైనా అల్లకల్లోలం అవుతోంది. ఇప్పటికే ఆ దేశంలో కఠిన ఆంక్షలు విధించగా తాజాగా పరిస్థితులు మరింత దిగజారాయి. ఒక్కరోజే జెజియాంగ్ ప్రావిన్స్‌లో పది లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.
జెజియాంగ్ ప్రావిన్స్ జనాభా దాదాపు 6.5 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ప్రావిన్స్ ప్రధాన నగరం హాంగ్ జౌ.. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌తో పాటు పలు కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. ఆపిల్‌తో పాటు జపనీస్ వాహన తయారీ సంస్థ నిడెక్ సహా తదితర విదేశీ కంపెనీలకు చెందిన తయారీ యూనిట్లు సైతం ఇక్కడే ఉన్నాయి.
దీంతో ప్రపంచ దేశాల ఆందోళన మరింత రెట్టింపైంది. న్యూ ఇయర్‌కు ముందు, తర్వాత కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి అంటే దాదాపు రోజుకి 20లక్షల వరకు నమోదయ్యే అవకాశం ఉంటుందని ఓ సంస్థ అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -