తమిళంలో మానాడు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెంకట్ ప్రభు దర్శకుడు. శింబు హీరో. ఈ ఇద్దరికీ భారీ బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. అందుకే ఈ కథ రీమేక్ రైట్స్ ను హీరో రానా భారీ మొత్తానికి కొనుకున్నాడు. రానా ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోల పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. నాని – విశ్వక్ సేన్ ఈ సినిమాలో నటిస్తునట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ టొటల్ స్క్రిప్ట్ పై దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కసరత్తులు చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ పై హరీష్ శంకర్ వర్క్ చేశాడు. అలాగే దర్శకత్వ బాధ్యతలు దర్శకుడు దశరధ్ టేకప్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే, ఇప్పుడు దర్శకుడి ప్లేస్ లోకి ఇంద్రగంటి వచ్చాడు. హీరోల ప్లేస్ లోకి నాని – విశ్వక్ వచ్చారు. మొదట రవితేజను హీరోగా అనుకున్నారు.
కానీ.. రవితేజ ప్లేస్ లోకి నాని వచ్చాడు. రానా జస్ట్ నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారు. అయితే, రీమేక్ లకు మంచి స్క్రిప్ట్ లు రాయడంలో ఇంద్రగంటి మోహనకృష్ణకు పెద్దగా అనుభవం లేదు. మరి మానాడు ను తెలుగుకు సెట్ అయ్యే విధంగా ఇంద్రగంటి స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేశాడు అనేది పెద్ద డౌట్. ఇంతకీ యాజ్ ఇట్ ఈజ్ గా రీమేక్ చేస్తున్నారా ?, లేక మార్పులు చేర్పులు చేస్తున్నారా ? అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి…