కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భేటీ..జాతీయ రాజకీయాలపై చర్చ..!

47
- Advertisement -

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్ కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి కి సీఎం కేసీఆర్ పూల బొకే ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి, ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రగతి, పంజాబ్ రాష్ట్ర పాలన తదితర అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. పంజాబ్ సీఎం మాన్ బి ఆర్ ఎస్ అధినేత సీఎం కేసిఆర్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

ఈ చర్చల అనంతరం, సీఎం కేసీఆర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు శాలువా కప్పి, మెమొంటో బహూకరించి వీడ్కోలు పలికారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎస్.మధుసూధనా చారి, కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎ. జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ ఎస్.వేణుగోపాల చారి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, రాష్ట్ర బిసి కమిషన్ మాజీ సభ్యులు ఈడిగ ఆంజనేయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -