భారత్‌లోనే ముస్లింలకు రక్షణ…అజ్మీర్ చిస్తీ

83
- Advertisement -

అఖిల భారత సూఫీ సజ్జదాన్షిన్ కౌన్సిల్ చైర్మన్ & అజ్మీర్ దర్గా ఆధ్యాత్మిక అధిపతి వారసుడైన హజ్రత్‌ సయ్యద్‌ నసీరుద్ధీన్ చిష్టీ పాక్‌ విదేశాంగ మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రి అయిన భుట్టోకి ఒక సలహా అంటూ పాకిస్తానీ ముస్లింల కంటే భారతీయ ముస్లింలు చాలా సురక్షితంగా, స్వేచ్ఛగా, మెరుగైన స్థితిలో ఉన్నారని పాకిస్థాన్ గుర్తుంచుకోవాలన్నారు.

భారతదేశాన్ని పాక్‌తో పోల్చవద్దని హెచ్చరించారు. ప్రతి ముస్లిం… భారతీయుడని అన్నారు. భారత ముస్లింగా చాలా గర్వంగా ఉందన్నారు. భారతదేశంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. వారి వారి వ్యక్తిగత మత స్వేచ్ఛకు భారత రాజ్యంగం హామీ ఇస్తుందని అన్నారు. అమెరికా దళాలు అంతర్జాతీయ ఉగ్రవాది అయిన ఒసామా బిన్‌లాడెన్‌ పాక్‌లో హంతమొందించిన విషయాన్ని బిలావల్‌ భుట్టో మరిచిపోయారని అని గుర్తు చేశారు.

భారత ప్రధాని మోదీపై పాక్ విదేశాంగ మంత్రి వాడిన విషపూరిత పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బిలావల్ భుట్టో మరియు పోర్టోఫోలియోతో పాటు పాక్ ప్రజలను డౌన్ గ్రౌడ్ చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి…

వైఎస్ జగన్ ‘ వార్నింగ్ ‘ లు..!

అమితాబ్ కామెంట్స్ పై రచ్చ

కోమటిరెడ్డి విత్ మోడీ..దేనికి చర్చ?

- Advertisement -