పవన్ మరో రీమేక్

23
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘తేరి’ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. హరీష్ తనదైన మార్పులతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ రీమేక్ సినిమా కంటే ముందే పవన్ ఓ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తమిళ్ లో సముద్రఖని తీసిన వినోదాయ సిత్తం సినిమాను తెలుగులో పవన్ చేత చేయించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో సముద్రఖనినే దర్శకుడిగా ఫైనల్ చేసేశారు. త్రివిక్రమ్ తనదైన మార్పులతో ఈ స్క్రిప్ట్ రెడీ చేశాడు.

దేవుడితో ఓ వ్యక్తి మాట్లాడుతూ తన జీవితాన్ని మళ్ళీ బాగుచేసుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ మోడరన్ గాడ్ గా కనిపించనున్నాడు. గతంలో పవన్ చేసిన గోపాలా గోపాలా సినిమాకు కాస్త దగ్గరగా ఉండే పాత్ర ఇది. ఇక సినిమాలో మెయిన్ రోల్ చేసిన మిడిల్ ఏజ్ క్యారెక్టర్ ను మార్చి కుర్రాడిగా పాత్రగా మార్చారు. ఆ క్యారెక్టర్ ను సాయి ధరం తేజ్ తో చేయించాలని ఫిక్సయ్యారు. ఆల్మోస్ట్ రెడీ షూట్ అనే స్టేజికి వెళ్ళిన ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.

తాజాగా త్రివిక్రమ్ పవన్ ను కలిసి ఈ రీమేక్ గురించి డిస్కషన్ జరిపారని , జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏదేమైనా అభిమానులకు మాత్రం పవన్ రీమేక్ సినిమాలు చేయడం మింగుడు పడటం లేదు. ఇప్పటికే నో రీమేక్స్ అంటూ ట్రెండ్ చేశారు. అయినా పవన్ మాత్రం వరుస పెట్టి రీమేక్ సినిమాలే చేస్తుండటంతో పవర్ స్టార్ పై ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

ఇండస్ట్రీలో అశ్లీలత ఎక్కువైంది :ముఖేష్

మహేష్ పై స్పెషల్ వీడియో

ప్రభాస్ ఎపిసోడ్ థియేటర్‌లోకి..?

- Advertisement -