మీ ఆట అనితర సాధ్యం:కోహ్లీ

8696
- Advertisement -

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ నుంచి పోర్చుగల్ జట్టు నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అప్రపంచకప్ సాధించాలనే రోనాల్డో కల కలగానే మిగిలిపోయింది. 37యేళ్ల రొనాల్డో మరో ప్రపంచకప్ ఆడే అవకాశాలు లేనందున్న అభిమానులు పెద్ద ఎత్తున్న మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా భారత స్టార్ విరాట్ కోహ్లీ ఒక భావోద్వేగ ట్వీట్‌తో రోనాల్డోకు సందేశాన్ని పోస్టు చేశారు.

“ఈ ఆటలో మీరు సాధించిన ఘనతను, అందించిన స్పూర్తిని ఏ ట్రోఫీ లేదా టైటిల్ దూరం చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులపై మీరు చూపిన ప్రభావాన్ని, మీ ఆటను చూసినప్పుడు మాకు కలిగే అనుభూతిని ఏ టైటిల్ వర్ణించలేదు. ఆటలో ప్రతిక్షణం మనసుపెట్టి ఆడటం కఠోర శ్రమ అంకిత భావానికి నిదర్శనం. ఇవన్నీ ఆ దేవుడు మీకందించిన ఆశీర్వాదాలు. అందుకే మీరు నాకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ” అని కోహ్లీ పోస్టు చేశాడు. పోర్చుగల్‌పై మొరాకో గెలిచిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

రికీని వెనక్కినెట్టిన కోహ్లీ….

బంగ్లాతో టెస్టు..టీమిండియా జట్టు ఇదే!

క్యూ ఆర్ కోడ్ పేమెంట్స్ తో జాగ్రత్త !

- Advertisement -