తెలంగాణలో నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ శుభవార్త తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉద్యోగుల జాతర కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణలోని జలవనరుల శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పట్టికే 61వేల ఉద్యోగాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం…తాజాగా భూగర్భ జలవనరుల శాఖలో 57ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది.

32గెజిటెడ్ 25నాన్ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 6నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను తీసుకోనున్నట్టు కూడా తెలిపింది. తదితర వివరాల కోసం https://www.tspsc.gov.in/ అనే వెబ్సైట్ను సంప్రదించొచ్చు. ఇప్పటికే గ్రూప్2,3,4 పోస్టులకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి తోడు గురుకులాల్లో కూడా ఉద్యోగ ప్రకటనలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
ఇవి కూడా చదవండి…

