ఇటీవల బీజేపీలో చేరిన నేతలంతా అసంతృప్తిలో ఉన్నారా..? బండి ఒంటెద్దు పొకడలతో విసిగిపోయారా…?పార్టీలో ప్రాధాన్యం లేక నలిగిపోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్దిరోజులుగా బీజేపీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందంటే ఎస్ అనే అనిపిస్తోంది. అందుకే వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరిన నేతలంతా యూటర్న్ తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్ ఇలా అంతా తమ సొంతగూటికి చేరుకున్నారు. వీరబాటలోనే మరికొంతమంది పయనించేందుకు సిద్ధం కాగా తాజాగా మరో బిగ్ వికెట్ పడనుందట. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్, తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరిగి కారెక్కేందుకు రంగం సిద్ధమైందని సమాచారం.
ఇందులో భాగంగానే ఇండియన్ రేస్ లీగ్ ప్రారంభం సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, కేటీఆర్ భేటీ అయ్యారు.. వీరిద్దరూ సన్నిహితంగా మెలగడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో త్వరలోనే కొండా కారెక్కుతారని ప్రచారం జోరందుకున్నాయి. 2014లో టీఆర్ఎస్ నుండి ఎంపీగా గెలుపొందారు కొండా. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరగా త్వరలోనే కారెక్కనున్నారని టాక్.
ఇవి కూడా చదవండి..