బీజేపీని నమ్ముకున్నోళ్ళే.. వెన్నుపోటు!

31
- Advertisement -

రాష్ట్రంలో ఎన్నికల వేళ బీజేపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తూ పార్టీ పరువును గంగలో కలుపుతుంటే అధిష్టానం నోరెళ్ళబెట్టే పరిస్థితి. ఇంతకీ బీజేపీకి ఇంత దారుణమైన గతి ఎందుకు పట్టింది ? అసలు బీజేపీలో ఏం జరుగుతోంది ? సొంత పార్టీ నేతలు బీజేపీని ఎందుకు నమ్మట్లేదు ? వంటి వాటిపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. గత కొన్నాళ్లుగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్న సంగతి విదితమే. అధిష్టానం ఎన్నిసార్లు చక్కదిద్దే ప్రయత్నం చేసిన ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడడంతో అవన్నీ పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేద్దామంటే నేతలు సహకరించని పరిస్థితి. దీంతో అధిష్టానం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటుంది. .

ముఖ్యంగా పార్టీలో ఆయా పదవులపై ఆ మద్య జరిగిన మార్పుల తరువాతే అసలు సమస్య మొదలైంది. తమకు ప్రదాన్యం కల్పించడం లేదని విజయశాంతి, వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి.. వంటి సీనియర్ నేతలంతా పార్టీ వ్యవహారాల విషయంలో సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. పోరాటాల కమిటీ చైర్మెన్ గా ఉన్న విజయశాంతి ప్రస్తుతం సొంత పార్టీపైనే పోరాటం చేస్తుండడంతో పార్టీ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతోంది. ఇక ఆయా పదవుల్లో ఉన్న మిగతా నేతలు చేతులెత్తేసి ఇతర పార్టీల గూటికి చేరుతున్నారు.

అభ్యర్థుల ఎంపికలో ముఖ్యపాత్ర పోషించాల్సిన స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఊహించని రీతిలో పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన వెళ్లిపోవడంతో బీజేపీలో అభ్యర్థుల ఎంపిక అరకొరగా జరుగుతోంది. ఇక ప్రచారంలో భాగంగా కొన్ని హామీలను ప్రకటించి ప్రజల్లోకి వెళదామనుకుంటే మేనిఫెస్టో రూపకల్పన చైర్మన్ వివేక్ కూడా బీజేపీకి గుడ్ బై చెప్పడంతో ఇంతవరకు మేనిఫెస్టోనే ప్రకటించలేని పరిస్థితి. ఇక కొండా విశ్వేశ్వర రెడ్డి సైతం బీజేపీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలే బలహీనంగా ఉన్న కాషాయ పార్టీకి సొంత పార్టీ నేతలు వెన్నుపోటు పొడుస్తూ షాక్ లు ఇస్తుండడంతో కమలం పార్టీ కుదేలవుతోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీజేపీ గాడిన పడే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:HCAలో అవినీతి..అజార్‌కు షాక్

- Advertisement -