విశ్వక్ సేన్ క్లారిటీ ఇవ్వాల్సిందేగా !

76
vishwak sen
- Advertisement -

యాంగ్రీ పెర్ఫార్మెన్స్ తో డిఫరెంట్ ప్రమోషన్స్ తో యూత్ లో మంచి ఇమేజ్ అందుకున్న విశ్వక్ సేన్ త్వరలో ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫలక్ నుమా దాస్ సినిమాతో దర్శకుడిగా మారిన విశ్వక్ ఈ సినిమాతో మరోసారి మెగా ఫోన్ పట్టాడు. ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రెయిలర్ రిలీజయింది.

ట్రైలర్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో విశ్వక్ ధమ్కీ మీద కామెంట్స్ మొదలు పెట్టారు నెటిజన్లు. ముఖ్యంగా ట్రెయిలర్ లో ఉన్న థీమ్ చూసి గోపీచంద్ గౌతమ్ నందతో పోలుస్తూ ట్రొల్ చేస్తున్నారు. నిజానికి విశ్వక్ తీసుకున్న కథ కూడా డ్యుయల్ రోల్ తో ఒకరు పూర్, ఇంకొకరు రిచ్. ఈ కేరెక్యర్స్ బిహేవియర్ చూసి కథ అటు ఇటుగా గౌతమ్ నంద తో పోలుస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.

నిజానికి విశ్వక్ కి ఇదేం కొత్త కాదు. అతని టీజర్ , ట్రెయిలర్ రిలీజైనప్పుడు ఇదంతా కామన్. అందులో ఉన్న మిస్టేక్స్ వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈసారి గోపీచంద్ డ్యూయల్ రోల్ తో చేసిన మూవీ తో కంపేర్ చేస్తూ సేమ్ థీమ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ పోలికలు గురించి హీరో కం డైరెక్టర్ విశ్వక్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -