పీఎస్‌2 ఎప్పుడంటే…

151
- Advertisement -

మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పొన్నియన్ సెల్వన్‌ సినిమా. అయితే దీనిలో మొదటి భాగమైన పీఎస్‌1 సెప్టెంబర్‌30న విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్‌ రేట్‌ను సాధించింది. కలెక్షన్‌లలో సునామీ జోరు చూపించింది. ఈ ఏడాది అత్యధిక గ్రాసర్‌లలో ఒకటిగా నిలిచింది. కేవలం తమిళంలోనే కాకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.460 కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించింది.

పీఎస్‌1కు సీక్వేల్‌గా పీఎస్‌2ను ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఓ తీపి కబురు పంపింది. దీంతో రెండో పార్టుకు సంబంధించిన రిలీజ్‌ డేట్‌ను నెట్టింట ప్రేక్షకులు తెగ వెతుకుతున్నారు. పొన్నియన్‌ సెల్వన్‌ పార్టు-2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

చియాన్‌ విక్రమ్‌, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మ్రదాస్‌ టాకీస్‌ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి..

BB6..కెప్టెన్‌గా శ్రీసత్య..

ఆయిల్‌ ఫామ్‌ సాగుకు ముందుకురండి..

మళ్లీ క్రేజీ కాంబో…సుక్కుతో చెర్రీ!

- Advertisement -