ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకురండి..

85
harishrao
- Advertisement -

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు మంత్రి హరీశ్‌ రావు. నంగునూరు మండ‌లం సిద్ద‌న్న‌పేట మార్కెట్‌యార్డులో వ‌డ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్‌తో క‌లిసి హ‌రీశ్‌రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌.. దేశానికి అన్నం పెట్టే ధాన్య‌గారంగా తెలంగాణ మారింద‌న్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేస్తామ‌ని చెప్పారు. ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన డ‌బ్బులు రాకున్నా.. తెలంగాణ రాష్ట్రం వ‌రి ధాన్యం కొంటుంద‌న్నారు.

సిద్దిపేట జిల్లాలో 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌రిధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. క్వింటాల్‌కు రూ. 2,060 గా నిర్ణ‌యించామ‌ని తెలిపారు.వ‌డ్లు కొన‌మంటే బీజేపీకి చేత‌కాదు కానీ.. రూ. 100ల కోట్లు పెట్టి ఎమ్మెల్యేల‌ను కొంటోంద‌ని మండిప‌డ్డారు. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాల‌న్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -