బీజేపీపై ఉద్యమం మొదలైంది:కేసీఆర్‌

220
- Advertisement -

భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న బీజేపీపై జేపీ లాంటి ఉద్య‌మాలు చూడ‌బోత‌రు అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో జరిగిన ప్రతి విషయాన్ని కూలంకషంగా మీడియా ప్రతినిధులకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ… ఒక్క‌సారి దేశం దెబ్బ‌తిన్న‌దంటే వంద సంవ‌త్స‌రాలు వెన‌క్కిపోతం. బీజీపీ విభజన రాజకీయాలు చేస్తోంది. భారత్‌ను ఆకలిరాజ్యంగా మార్చేసిందని ధ్వజమెత్తారు. ఈ విష‌యాన్ని అనేక సంద‌ర్భాల్లో చెబుతున్నాను.

మ‌న రాష్ట్రంలో కూడా బీజేపీ నాయ‌కులు దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాను. ఏ అహంకారానికి ఇది నిద‌ర్శ‌నం. ఎవ‌రు స‌హించ‌బ‌డాలి. దీని వెనుకాల ఎవ‌రు ఉన్నారు. గ‌త నెల‌లోనే ఇక్క‌డికి ఒకాయ‌న రామ‌చంద్ర‌భార‌తి అనే వ్య‌క్తి వ‌చ్చాడు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విశ్వ‌ప్ర‌య‌త్నం చేసి క‌లిసి మాట్లాడాడు. వారు ఏం ప్లాన్ చేసిండ్రో అర్థ‌మైన త‌ర్వాత మాకు ఫిర్యాదు చేశారు. హోంమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. దానిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాలి. అది పెద్ద‌గా ఉన్న‌ది. మూడు గంట‌లు ఉంది దాదాపు. కానీ కోర్టు, ప్ర‌జ‌ల కోసం అవ‌స‌ర‌మైన మేర‌కు ఇస్తున్నాం. మీరు కూడా ఆశ్చ‌ర్య‌పోతారు. వారు తీసుకున్న పేర్ల‌లో దేశంలో అత్యున్న‌త ప‌ద‌వుల్లో ఉన్నారు.

8 ప్ర‌భుత్వాలు కూల‌గొట్టాం. మ‌రో 4 ప్ర‌భుత్వాలు కూల‌గొడుతాం. తెలంగాణ‌, ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌లో ప్ర‌భుత్వాలు కూల‌గొడుతాం అని ఆ ముఠా స‌భ్యులు పేర్కొన్నారు. దీన్ని రాజ‌కీయం అంటారా? అక్క‌డ మౌనం పాటించారు కాబ‌ట్టి 8 ప్ర‌భుత్వాలు కూలిపోయాయి. తెలంగాణ చైత‌న్య‌వంత‌మైన గ‌డ్డ కాబ‌ట్టి.. ఈ రాక్ష‌సుల కుట్ర‌ను బ‌ద్ద‌లు కొట్టారు. ఆ ముఠాను ప‌ట్టుకున్నాం కాబ‌ట్టి ఇదంతా బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌త అనేక రోజులుగా ఈ వ్య‌వ‌హారం జ‌రుగుతుంది.

 

ఈడీ టు ఇన్ క‌మ్ ట్యాక్స్ అంతా మా వ‌ద్దే ఉన్న‌రు అని చెప్పారు. ఈ దేశంలో ఏం జ‌రుగుతోంది. ఈ ముఠాల స్వైర‌విహారం చూస్తే మీరు ఆశ్చ‌ర్య‌ప‌డుతారు. ఈ ముఠాలో 24 మంది స‌భ్యులు ఉన్నారు. ఒక్కొక్క‌రికి రెండు మూడు ఆధార్ కార్డులు ఉంటాయి. ఇది పెద్ద ఫ్రాడ్. మొన్న దొరికిన కేర‌ళ‌కు చెందిన తుషార్.. వ‌య‌నాడ్‌లో రాహుల్‌పై పోటీ చేశారు అని కేసీఆర్ గుర్తు చేశారు.

మ‌మ్మ‌ల్ని ఎవ‌రు ఏం చేయలేర‌నే ధోర‌ణితో ముందుకు పోతున్నారు. ఈ దుర్మార్గాలు అరిక‌ట్ట‌బ‌డాలి. దుర్మార్గాన్ని ఉపేక్షించ‌డం అనేది ఏ ఒక్క‌రికి, దేశం ఉనికికి మంచిది కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే బీజేపీ కొంటుంది. రూ. 100 కోట్లు ఇస్తం. గ‌తంలో అలానే ఇచ్చాం. ఇది మాకు నిత్య కృత్య‌మే. మిగ‌తావి కూడా చేసుకుంటాం. సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్త‌మ‌ని చెప్త‌రు. సెంట్ర‌ల్ సెక్యూరిటీ వై కేట‌గిరి ఇస్త‌మ‌ని చెప్త‌రు. రాజ్యాంగేత‌ర శ‌క్తుల్లో భార‌త ప్ర‌భుత్వం ఉంది. ఈ వీర‌విహారం అరిక‌ట్ట‌బ‌డ‌క‌పోతే అంద‌రికీ ప్ర‌మాద‌మే. ఈ ప‌ద్ధ‌తిని ప్ర‌తి ఒక్క‌రూ ఖండించాలి.

ప్ర‌తి స్టేట్‌లో త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్త‌రు. ప్ర‌ధానిగారే చెబుతున్నారు. ఇదేం దేశం. ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారు. ఇవన్నీ కూడా బ‌య‌ట‌కు రావాలి. డిమాండ్ చేస్తున్నా. కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారు. ఈ ఎన్నిక‌లు ఇవ‌న్నీ ఎందుకు. ఈ ర‌క‌మైన ప‌ద్ధ‌తులు మంచిది కాదు. మేం దుర్మార్గంగా ఎమ్మెల్యేల‌ను క‌లుపుకోలేదు.

కొంద‌రు కాంగ్రెస్ మిత్రులు మాద‌గ్గ‌రికి వ‌చ్చి క‌లుస్తామ‌ని చెప్పారు. చాలా రోజుల త‌ర్వాత రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద్ద‌తుల్లో క‌లుపుకొన్నాం. కానీ మీలా కొనుగోలు చేయ‌లేదు. ఎమ్మెల్యేల‌ను కొంటామ‌ని చెప్పి.. నీ ప్ర‌భుత్వాన్ని కూల‌గొడుతామ‌ని వ్య‌వ‌హ‌రిస్తే మేం చేతులు ముడుసుకొని కూర్చోవాలా? మీ అరాచ‌క వ్య‌వ‌హారాన్ని నిశ‌బ్దంగా భ‌రించాలా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు.

ఇవి కూడా చదవండి..

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

ఎగ్జిట్‌పోల్‌ సర్వేల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం స్థాయిలు

- Advertisement -