ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

217
- Advertisement -

ఉత్కంఠ రేపిన మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 77.55శాతం పోలింగ్‌ నమోదైంది. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మంద‌కొడిగా సాగిన పోలింగ్.. ఆ త‌ర్వాత పుంజుకుంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓట‌ర్లు బారులు తీరారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో 2,41,805 ఓట్లు ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు 1,87,527 ఓట్లు పోలైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

చౌటుప్ప‌ల్, నారాయ‌ణ‌పురంలో భారీగా పోలింగ్ న‌మోదైంది. అయితే పోలింగ్ స‌మ‌యం ముగిసే స‌మ‌యానికి క్యూలైన్ల‌లో నిల్చున్న వారంద‌రికీ ఓటేసేందుకు అధికారులు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. ప‌లు చోట్ల మరో గంట పాటు పోలింగ్ కొన‌సాగే అవ‌కాశం ఉంది. ఓటేసేందుకు మ‌హిళ‌లు, వృద్ధులు, యువ‌త బాగా ఆస‌క్తి చూపారు. మొత్తంగా మునుగోడులో భారీగా పోలింగ్ న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. నియోజకవర్గంలో కొన్ని చోట్ల చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్టు ప్రకటించారు.

టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీజేపీ త‌ర‌పున రాజ‌గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి బ‌రిలో ఉన్నారు. ఈ ముగ్గురి మ‌ధ్య‌నే ప్ర‌ధాన పోటీ నెల‌కొంది. వీరి భ‌వితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంల‌లో నిక్షిప్తం చేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు న‌వంబ‌ర్ 6వ తేదీన వెలువ‌డ‌నున్నాయి.

ఇవి కూడా చదవండి..

టీఆర్ఎస్‌ కార్యకర్తలకు ధన్యవాదాలు:కేటీఆర్

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం స్థాయిలు

వెండితెర వెనుక ఎన్నో వ్యథలు

- Advertisement -