బీజేపీ నుండి దేశాన్ని కాపాడండి: సీఎం కేసీఆర్

170
- Advertisement -

బీజేపీ నుండి దేశాన్ని కాపాడాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను వేడుకున్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం.. విభజన రాజకీయాలు చేస్తోంది. భారత్‌ను ఆకలిరాజ్యంగా మార్చేసిందని ధ్వజమెత్తారు. సీబీఐ, ఈడీ, సీవీసీ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు.

స్వార్ధం కోసం మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని మండిపడ్డ సీఎం…ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని.. ఓటమైనా, గెలుపైనా గంభీరంగా స్వీకరించాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, పాల్వాయి గోవర్దన రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి తనను వచ్చి కలిసి నట్లు దుష్ప్రచారం చేసిందని మండి పడ్డారు.

ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అంతా సక్రమంగా ఉన్నట్లు, లేకపోతే లేదన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాము నాగార్జున సాగర్‌, హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో గెలిచాం అని గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించడం సరి కాదన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విఫలం అయ్యారని బీజేపీ నేతలు ఆరోపించారని, ఇది అత్యంత దిగజారుడు విధానం అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపి నీచ రాజకీయాలు చేయాలని చూశారన్నారు. మఠాధిపతులు, పిఠాధిపతుల ముసుగులో రాజ్యమేలేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దేశంలో దుర్మార్గమైన విధానాలున్నాయని..బీజేపీ అన్ని రంగాలను సర్వనాశనం చేసిందన్నారు. 24 మందితో కూడిన ముఠా దేశాన్ని ఏలే ప్రయత్నం చేస్తోందని దీని వెనుక ఎవరున్నారో బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల ఆఫర్ చేశారని…ఆ డబ్బు ఎక్కడిది, ఎవరిస్తున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -