కాంతారకు ఎదురుదెబ్బ ఎందుకో తెలుసా…

132
- Advertisement -

చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయం సాధించిన కాంతార మూవీకి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకృతికి మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేస్తూ తెరకెక్కిన చిత్రమే కాంతార.

భూతకోల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా భావించే వరాహరూపం పాటను ఇకపై ప్రదర్శించడకూడదని కేరళలోని కోజికోడ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు ఆదేశించింది. థాయికుడమ్‌ బ్రిడ్జ్‌ వారు రూపొందించిన నవరసం అనే ఆల్బమ్‌కు కాపీగా వరాహరూపం తీర్చిదిద్దారని పేర్కొంటూ ఈ తీర్పును వెలువరించింది.

థాయికుడమ్‌ బ్రిడ్జీ అనుమతి లేకుండా థియేటర్లలోనే కాకుండా యూట్యూబ్‌ ఇతర మ్యూజిక్స్‌ యాప్స్‌లోనూ దీన్ని ప్రదర్శించకూడదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. దీన్ని తెలియ జేస్తూ థాయికుడమ్‌ బ్రిడ్జ్‌ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. గతంలో కూడా ఇన్‌స్టా వేదికగా థాయికుడమ్‌ బ్రిడ్జీ పోస్ట్‌ పెట్టారు. ఈ విషయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

కాంతార తగ్గేదెలె..! కార్తికేయ-2 రికార్డ్ బ్రేక్

కాంతార సినిమాపై ఫిర్యాదు..నిజమేంత?

కాంతార ఎఫెక్ట్..వారికి పింఛన్లు

 

- Advertisement -