రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా సప్తమి హీరోయిన్‌గా నటించిన చిత్రం కాంతార. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించగా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. దేశమంతటా ఇప్పుడు కాంతార సినిమా పేరే వినిపిస్తుంది. ఈ సినిమాలో కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని అద్భుతంగా చూపించారు.
ఈ సినిమాకు అద్భుత స్పందన వస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం.
బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ట్వీట్ చేస్తూ.. కర్ణాటకలో దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవిస్తున్న వారిలో 60 ఏళ్ళు దాటిన వారికీ కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెలా రూ.2000 అందిస్తుంది అని తెలిపారు.

