ఎవరెన్నీ కుయుక్తులు పన్నినా మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో తెరాస పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో మంత్రి సమావేశమయ్యారు.
ఈనెల 30న జరగనున్న సీఎం కేసిఆర్ మునుగోడు బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మునుగోడులో ప్రజల్లోకి వెళ్లి వివరించాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి అనురించాల్సిన వ్యూహాలపై వారితో మంత్రి చర్చించారు.
ఎక్కడా లేని విధంగా దేశమంతా తమకూ కావాలనే విధంగా సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకూ అందుతున్నాయన్నారు. ఈ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. విపక్షాల కుట్రలు, అసత్య ప్రచారాలను బలంగా తిప్పికొట్టాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.
ఇవి కూడా చదవండి
తిరుమలలో స్మృతి ఇరానీకి ఘన స్వాగతం
బీజేపీ వల్లే దేశం తిరోగమనం :రాహుల్
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి