టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. పాకిస్థాన్‌పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. జింబాబ్వే విధించిన 131 పరుగుల లక్ష్యఛేదనలో పాక్..129 పరుగులకే పరిమితమైంది. స్వల్ప స్కోరును కాపాడుకోవడంలో జింబాబ్వే బౌలర్లు సమష్టిగా రాణించారు. దీంతో పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఇక ముఖ్యంగా సికిందర్ రజా మ్యాజిక్ చేశాడు. 4 ఓవర్లలో 25 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఇక వరల్డ్ కప్‌లో పాక్‌కు ఇది రెండో ఓటమి.
ఒక ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. రజా 7 అవార్డులు గెలుచుకోగా, 6 అవార్డులతో కింగ్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక ఈ వరల్డ్ కప్‌లో 5 సంచలనాలు నమోదయ్యాయి. క్వాలిఫయింగ్ మ్యాచుల్లో శ్రీలంకపై నమీబియా విజయం సాధించగా విండీస్‌పై స్కాట్లాండ్,విండీస్‌పై ఐర్లాండ్,ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి..