బిగ్ బాస్ తెలుగు 6 విజయవంతంగా సాగుతోంది.12వ రోజు ఎపిసోడ్ పూర్తికాగా ఇంటి సభ్యుల రియల్ జర్నీని చూపిస్తూ ఏడిపించేశారు. మీ జీవితంలో ఒక బేబీ ఉండటం ద్వారా మీ జీవితానికి ఎటు వంటి అర్దాన్ని తీసుకుని వస్తుందన్న దానిపై తమ భావాలను ప్రేక్షకులతోను.. తోటి ఇంటి సభ్యులతోనూ పంచుకోవాలని చెప్పారు బిగ్ బాస్.
మొదటిగా ఆదిరెడ్డి ఈ ఎమోషనల్ జర్నీని స్టార్ట్ చేశాడు. తన కూతురు అద్విత అని.. తనకి పిల్లలంటే ఇష్టం ఉండదని చెప్పాడు. తన చెల్లెలు బ్లైండ్ కావడంతో.. తన కూతురు కూడా అలాగే పుట్టిందని చాలామంది బంధువులు అన్నారని.. ఆరోజున చాలా బాధపడ్డానని చెప్పాడు.
ఆ తర్వాత సుదీప.. తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్పి అందరి కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది. నా గర్భంలో ఉన్న బిడ్డతో నేను మాట్లాడటం స్టార్ట్ చేశా.. హాస్పటల్‌కి వెళ్లాను.. బేబీకి హార్ట్ బీట్ వచ్చింది. అంతా బాగానే ఉందనుకున్న టైంలో నాకు థైరాయిడ్ హై అయిపోయింది. దాన్ని నేను చూసుకోలేక.. నా బిడ్డను నేను కోల్పోయాను అని తెలిపారు.
నా చెల్లి కూతురు వచ్చేవరకూ కూడా నాది అని అనుకోలేకపోయాను. దాని వల్లే మా రెండు ఫ్యామిలీలు దగ్గరయ్యాయి. మా ఆయన అంటుంటాడు.. అది వాళ్ల పిల్ల ఎప్పుడైనా ఇచ్చేయాలి అని.. చిన్న బొమ్మనే ఇవ్వాలంటే మనసు ఒప్పదు మనకి. వాళ్ల కూతుర్ని వాళ్లకి ఇవ్వడానికి నాకు ప్రాణం పోయినట్టు అనిపించిందని చెప్పారు.
కళ్ల ఎదుటే ఫైర్ యాక్టిడెంట్ జరిగి తల్లి చనిపోయిందని ఆ తర్వాత కవల పిల్లల రూపంలో తనకు దేవుడు అమ్మను ప్రసాదించాడని తెలిపారు చంటి.దేవుడిని దర్శించుకోని తిరిగి వస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో తన కుటుంబం మొత్తం చనిపోయారని కీర్తి భట్ ఎమోషనల్ అయింది.