స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ఘన విజయం సాధించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసి 80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
మార్క్‌ను క్రాస్ చేసిన ఈ చిత్రం వంద కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా సీతారామం అనూహ్య రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో దుల్కర్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. సినిమా విడుదలై 25రోజులు దాటుతున్న ఇప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు.
ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. పీరియాడికల్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్‌కు జోడీగా మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటించింది. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా ముఖ్య పాత్రలో నటించింది.