కోబ్రా థర్డ సింగిల్‌ అప్‌డేట్‌….!

90
cobra
- Advertisement -

సౌత్‌ సినిమాలంటే ప్రయోగాలకు పుట్టినిల్లు. ప్రయోగాలతో ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకొన్న నటుల్లో చియాన్ విక్రమ్‌.శివపుత్రుడు అపరిచితుడు ఐ ఇంకొక్కడు లాంటి సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ మూవీగా చెప్పవచ్చు. తాజాగా విక్రమ్‌ నటించిన మూవీ కోబ్రా విడుదలకు సిద్దమవుతోంది. అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలే ఉన్నాయి. చిత్రం నుండి విడుద‌లైన విక్ర‌మ్ పోస్ట‌ర్‌లు అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఎన్నో వాయిదాల త‌ర్వాత ఈ చిత్రం ఆగ‌స్టు 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వ‌రుసగా అప్‌డేట్‌ల‌ను ఇస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలోని థ‌ర్డ్ సింగిల్ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలోని తరంగిణి అంటూ సాగే మెలోడీయ‌స్ గీతాన్ని ఆగ‌స్టు 16న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన అధీరా సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో విక్ర‌మ్ ఏడు విభిన్న గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు టాక్. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీత సారథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ప‌తాకంపై ఎస్‌.ఎస్‌.ల‌లిత్ కుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా నిర్మించాడు. ప్ర‌ముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో న‌టించారు.

- Advertisement -