అవసరమైతే సంప్రదించండి: ఇండియన్‌ హైకమిషన్‌

68
srilanka
- Advertisement -

శ్రీలకం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లంకలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కొలంబోలోని ఇండియన్‌ హైకమిషన్‌ సూచించింది. అవసరమైతే తమను సంప్రదించాలని…పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వాటికి అనుగుణంగా ప్రయాణాలు, పనులు చేసుకోవాలని తెలిపింది.

ప్రజాగ్రహంతో మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోగా ఇవాళ కొత్త అధ్యక్షుడు, ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. అధ్యక్ష రేసులో దులస్‌ అలహాప్పెరుమాను, ప్రధాని పదవికి ప్రతిపక్ష నేత సాజిత్‌ ప్రేమదాస ముందంజలో ఉన్నారు.

- Advertisement -