సమంత @ కాఫీ విత్ కరణ్

139
sam
- Advertisement -

బాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ షో కాఫీ విత్ క‌ర‌ణ్.బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఇప్ప‌టివ‌ర‌కు ప‌లువురు బాలీవుడ్ న‌టులు పాల్గొని షోకి మ‌రింత రేటింగ్ తెచ్చారు. ఇటీవలె ఏడో సీజన్ మొదలుకాగా రెండు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. ఇక మూడో ఎపిసోడ్లో గెస్ట్‌లుగా అక్షయ్ కుమార్, సమంత రాబోతున్నారు.

ఇందుకు సంబంధించి ప్రొమో రిలీజ్ చేయగా వైరల్‌గా మారింది. ఇందులో అక్షయ్ సమంతని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చాడు. కరణ్ ఇద్దర్ని డ్యాన్స్ చేయాలి అని చెప్పడంతో ఇద్దరూ డ్యాన్స్ చేస్తుండగానే మరోసారి అక్షయ్ సమంతని ఎత్తుకొని తిప్పేసి వెనక్కి పట్టుకున్నాడు.

- Advertisement -