హైద‌రాబాద్ జంట జ‌లాశ‌యాలు నిండుకున్నాయి

98
osmansagar
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి నగరం తడిసి ముద్దవుతుంది. నిరంతరాయంగా కురుస్తున్న వానలకు వరదనీరు పోటెత్తడంతో జంట జలాశయాలు అయిన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నిండుకుండలా జలకళతో తొణికిసలాడుతున్నాయి.

ఉస్మాన్‌ సాగర్‌లోకి 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, రెండు గేట్లు ఎత్తి 312 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడిచిపెడుతున్నారు. ఉస్మాన్‌ సాగర్‌ పూర్థిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1786 అడుగుల వరకు నీటి మట్టం చేరుకుంది. హిమాయత్‌ సాగర్‌కు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, రెండు గేట్లు ఎత్తి 515 క్యూసెక్కుల నీటిని మూసీలొకి విడుదల చేస్తున్నారు ఆధికారులు.

మరోవైపు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ కూడా నిండుకుంటొంది. ప్ర‌స్తుతం సాగర్‌ పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 514.75 అడుగులు కాగా 513.41 అడుగుల నీటిమ‌ట్టంకు చేరుకుంది. హుస్సేన్ సాగ‌ర్ పూర్తిగా నిండిపోవ‌డంతో.. దిగువ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. సాగర్‌ తూముల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -