అభాగ్యులకు అండగా ఉంటాం ఎమ్మెల్సీ కవిత.

39
telangana jagruti
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతున్న వేళ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల బాధితులకు ఎమ్మెల్సీ, జాగృతి ఆద్యక్షురాలు కవిత చేయూతనిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు జాగృతి కార్యకర్తలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల ఆకలి తీరుస్తున్నారు. వారి ఆకలిని తీర్చడంతో పాటు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. గత ఐదు రోజులగా కురుస్తున్న వర్షాలతో ప్రజల కష్టాల్ని చూసి తమ వంతు సహాయం చేస్తున్నారు. కవిత ఆద్వర్యంలోని జాగృతి కార్యకర్తలు చేస్తున్న పలు కార్యక్రమాలను పలువురు కొనియాడుతున్నారు.

వర్షపు నీరు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీల ప్రజలకు ఆహార పొట్లాలను అందిస్తున్నారు. అలాగే కేసీఆర్‌ బువ్వకుండా ద్వారా వారి ఆకలిని తీర్చారు. నగరంలోని ధర్మపురి కాలనీ, నాగారం, రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పలువురికి భోజనాన్ని అందించారు. గత ఏడాది కూడా భారీ వరదల వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్న గూపన్పల్లి వాగు పరివాహక ప్రాంత వాసులను కవిత ఆదుకున్నారు.

- Advertisement -