- Advertisement -
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మపై కోల్‌కతా పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆమెను అమ్‌హెరెస్ట్, నార్కెల్‌దంగా పోలీస్‌స్టేషన్ల ఎదుట హాజరుకావాలని కోరారు. అయితే ఇప్పటి వరకు ఆమె హాజరుకాకపోగా మరింత సమయం కోరింది.
తన ప్రాణాలకు భయం ఉందని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేయాలని నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. కేసును పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.
నుపుర్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని సుప్రీం స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదైనా.. అరెస్టు కాకపోవడం ఆమె పలుకుబడిని సూచిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
- Advertisement -