బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్‌..

41
Mamata Banerjee
- Advertisement -

బీజేపీ చేసిన పాపాలకు ప్రజలెందుకు బాధలు అనుభవించాలని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిన్న హౌరాలో నిర్వహించిన ఆందోళనలో హింస చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం కూడా హౌరాలో అల్లర్లు జరిగాయి. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో, పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దాంతో ఈ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలపై బుధవారం వరకు నిషేధాజ్ఞలు విధించారు. హౌరాలోని పలు ప్రాంతాల్లో అమల్లో ఉన్న 144 సెక్షన్ ను జూన్ 15వ తేదీ వరకు పొడిగించారు.

ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో స్పందించారు. కొన్ని రాజకీయ పక్షాలే అల్లర్లను సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిస్థితులు హింసాత్మక మారుతున్నాయని ఇదంతా బీజేపీ మత రాజకీయాల వల్లే అని మమత ఆరోపించారు. గత రెండ్రోజులుగా హింసాత్మక ఘటనలతో హౌరాలో సాధారణ జనజీవనం దెబ్బతిన్నదని మమత వివరించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ అల్లర్ల వెనుక ఉన్నాయని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా,మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో పలుచోట్ల అల్లర్లు జరుగుతున్నాయి.

- Advertisement -