తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఇవాళ ఉదయం ఆలయానికి చేరుకున్న దత్తాత్రేయకు ఆలయ ఈవో ధర్మారెడ్డి , ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. దర్శన అనంతరం గవర్నర్ దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు, టీటీడీ ముద్రించిన క్యాలెండర్‌ను, ఫొటోను అందజేశారు.
ఇక తిరుమలకు విరాళాలు పెద్ద ఎత్తున వచ్చాయి. టీవీఎస్ మోటార్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ శనివారం స్వామివారికి కోటీ 5లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన జీవీఏ ఇన్ఫ్రా సంస్థ శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ. కోటీ 26వేలను అందజేశారు. హరిబాబు, S వెంకటేశ్వరులు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. 10 లక్షలు, S రవిబాబు రూ. ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ. 2 లక్షల 50 వేలు డోనర్ సెల్లో అందజేశారు.
ఇక నిన్న శ్రీవారిని 76,407 మంది భక్తులు దర్శించుకోగా 39,938 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.