ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ, జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాగా తాజాగా రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చింది. ఈ మేరకు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్‌తో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై బెంగళూరులో సంతకాలు చేశారు.
స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ఫోన్ల డిస్‌ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ భారత్‌లో అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పడం శుభపరిణామం అన్నారు. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ (ఎలెస్ట్) అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ తయారీ యూనిట్‌ను తెలంగాణలో స్థాపించనుందని….ఇందులో భాగంగా రూ.24వేలకోట్ల పెట్టుబడి పెట్టనుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇప్పటి వరకు జపాన్, కొరియా, తైవాన్ దేశాలకు సాధ్యమైన అరుదైన ఫీట్ ఇకపై ఇండియాలోనూ చోటు చేసుకోబోతుందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ రాకతో టీవీలు, ట్యాబ్స్, స్మార్ట్‌ఫోన్ల తయారీకీ అవసరమైన ఎకో సిస్టమ్ తెలంగాణలోనే తయారవుతుందని చెప్పారు. , తెలంగాణకు ఈ రోజు చారిత్రాకమైన రోజని కేటీఆర్ అభివర్ణించారు.