రివ్యూ: అంటే సుంద‌రానికీ

229
ante sundaraniki
- Advertisement -

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా నటించిన చిత్రం “అంటే సుంద‌రానికీ” ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురాగా మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా తెర‌కెక్కింది. వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన‌ హీరో నాని ఈ మూవీతో ఆక‌ట్టుకున్నాడా లేదా చూద్దాం..

క‌థ‌:
సుందర్ (నాని) మరియు లీల (నజ్రియా) వేర్వేరు మతాలకు చెందిన వారు అయినప్పటికీ చిన్ననాటి స్నేహితులు. సుందర్ కు మొదటి నుండి లీల అంటే క్ర‌ష్. కానీ ఆమెకు చెప్పేందుకు భ‌య‌ప‌డ‌తాడు. సీన్ క‌ట్ చేస్తే కొన్ని సంవత్సరాల తరువాత, సుందర్ మరియు లీల ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాల‌ను ఒప్పించేందుకు ఓ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తారు..? సుంద‌ర్, లీల చేసే ఆ ప్ర‌ణాళిక ఏంటీ?, రెండు కుటుంబాల‌ను ఎలా ఒప్పిస్తారు?, చివ‌రికి క‌థ ఎలా సుఖాంతం అవుతుంద‌నేదే అంటే సుంద‌రానికి క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్‌:
సినిమాలో మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్స్ నాని న‌ట‌న‌, మాట‌లు, క్యాస్టింగ్. నాని న‌ట‌న సూప‌ర్బ్. సుంద‌ర్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. అద్భుత న‌ట‌న‌తో సినిమాను మ‌రో స్ధాయికి తీసుకెళ్లాడు. ఇక నానితో పోటీ ప‌డి న‌టించింది న‌జ్రియా. త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది.మిగితా న‌టీన‌టుల్లో నరేష్, నదియా, రోహిణి, అళగం పెరుమాళ్ త‌మ పాత్ర‌ల‌కు వంద‌శాతం న్యాయం చేశారు.

మైన‌స్ పాయింట్స్‌:
సినిమాలో మేజ‌ర్ మైన‌స్ పాయింట్స్ ర‌న్ టైమ్, ఫ‌స్టాఫ్, మ్యూజిక్. ఫ‌స్టాఫ్, సంగీతంపై కాస్త దృష్టి సారిస్తే బాగుండేది.

సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. వివేక్ సాగ‌ర్ అందించిన సంగీతం అంత‌గా ఆక‌ట్టుకోలేదు. సినిమాలో గుర్తుండిపోయే పాటలు ఏవీ లేవు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక విజువల్ గా అంటే సుందరనికి క్లాసీ. సినిమాటోగ్రాఫర్ బాగుంది. ఎడిటింగ్‌పై కాస్త దృష్టిసారిస్తే బాగుండేది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ విలువ‌ల‌కు వంక‌పెట్ట‌లేం.

తీర్పు:
వైవిధ్య‌మైన సినిమాల‌కు కేరాఫ్‌గా నిలిచిన నాని చేసిన మ‌రో ప్ర‌యోగ‌మే అంటే సుంద‌రానికి. నాని న‌ట‌న సినిమాకు ప్ల‌స్ పాయింట్‌కాగా ర‌న్ టైమ్ ,ఫ‌స్టాఫ్‌పై దృష్టి సారిస్తే బాగుండేది. ఓవ‌రాల్‌గా ఈ వీకెండ్‌లో చూడ‌ద‌గ్గ చిత్రం అంటే సుంద‌రానికీ.

విడుద‌ల తేదీ:10|06|2022
రేటింగ్: 2.5|5
న‌టీన‌టులు: నాని, న‌జ్రియా
సంగీతం: వివేక్ సాగ‌ర్
నిర్మాత‌: మైత్రీ మూవీ మేక‌ర్స్
ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌

- Advertisement -