రాష్ట్రపతి ఎన్నికలు…సీఎం కేసీఆర్ వ్యూహమేంటీ?

134
kcr cm
- Advertisement -

రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని పార్టీల్లో ఈ ఎన్నికపై హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి పేరును ప్రతిపాదిస్తాయి..? ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుంది అన్నదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఇక ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరికి మద్దతిస్తారు అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కేసీఆర్‌ వ్యూహం ఎలా ఉండబోతోంది..? ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే దిశగా కేసీఆర్‌ పావులు కదుపుతున్నారా..? అసలు కేసీఆర్‌ ఏం చేయబోతున్నారు..? ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది..

రాష్ట్రపతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. ఇటీవలె పలు పార్టీల నేతలను కలిసిన సీఎం కేసీఆర్.. రెండు నెలల్లో సంచలన ప్రకటన వింటారంటూ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది ఎవరికి అంతుబట్టడం లేదు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 2.2 శాతం ఓట్లున్నాయి. బీజేపీ మిత్రపక్షాలను కలుపుకున్నా సరిపోయేంత బలం లేదు.. బయటి నుంచి మద్దతు తీసుకుంటే తప్ప గెలిచే పరిస్థితి లేదు.

దీంతో పలు ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఇక ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల నుండి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అన్నా హజారేతో పాటు దేవెగౌడ మరో ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరి పేర్లను సీఎం కేసీఆర్ తెరమీదకు తీసుకురాగా ఇందులో ఎవరిని ఫైనల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయనేది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -