జై భీమ్‌కు మరో రెండు అవార్డులు..

48
jai bhim
- Advertisement -

హీరో సూర్య స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం జై భీమ్. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలే కాదు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటివరకు జాతీయ స్ధాయిలో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంకు పలు అవార్డులు వరించగా తాజాగా మరో రెండు అవార్డులు దక్కాయి.

ఈ విషయాన్ని సూర్య నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలిపింది. గత నెల ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు జరిగిన ‘బోస్టన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో జై భీమ్‌ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో నటించిన నటి లియోమోల్‌ జోస్‌కు ఇండీ స్పిరిట్ బెస్ట్‌ యాక్ట్రెస్ అవార్డు వరించగా, ఇండీ స్పిరిట్ బెస్ట్‌ సినిమాటోగ్రఫీ అవార్డును మూవీ కెమెరామెన్‌ ఎస్‌.ఆర్‌. కదీర్‌ అందుకున్నారు.

టీజే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన జై భీమ్‌కు ఇటీవల ‘దాదా సాహేబ్‌ పాల్కే ఫిలీం ఫెస్టివల్‌’లో రెండు అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. ఇందులో బెస్ట్ ఫిలిం అవార్డుతో పాటు ఈ సినిమాలో నటించిన మణికందన్‌కు బెస్ట్‌ సపోర్టింగ్ యాక్టర్‌ అవార్డు వచ్చింది.

- Advertisement -