నవంబర్ 2న సూర్య ‘జై భీమ్’..

154
- Advertisement -

త‌మిళ‌స్టార్ హీరో సూర్య ఇటీవ‌ల ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో సూప‌ర్‌స‌క్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘జై భీమ్’ అనే సినిమాలో నటిస్తున్న్నారు. జె. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సూర్య సరసన నాయికగా రజీషా విజయన్ నటించగా, ఒక కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌కి ఇచ్చినట్టుగా చాలా రోజుల క్రితమే చెప్పారు. నవంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ జరగనున్నట్టు తాజాగా ప్రకటించారు మేకర్స్‌.

ఈమూవీలో సూర్య లాయర్‌గా క‌నిపిస్తున్నారు. తమ భూముల కోసం పోరాడే పేదల తరపున అండగా నిలబడే పవర్‌ఫుల్ లాయర్‌గా ఆయన కనిపించనున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సుర్య శివ‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ క‌ర్పూర సుంద‌ర పాండియ‌న్ స‌హ నిర్మాత‌. సేన్ రోల్డ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీకి ఎస్ఆర్ క‌థీర్ సినిమాటోగ్రాఫ‌ర్‌, పిలోమిన్ రాజ్ ఎడిట‌ర్‌.

తారాగ‌ణం: సూర్య, రాజీషా విజ‌య‌న్, ప్ర‌కాష్ రాజ్‌, రావు ర‌మేష్, సంజ‌య్ స్వ‌రూప్‌
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం – టీజే జ్ఞాప‌వేల్‌
సంగీతం – సేన్ రోల్డ‌న్
సినిమాటోగ్ర‌ఫి – ఎస్ఆర్ క‌థీర్
ఎడిట‌ర్ – పిలోమిన్ రాజ్
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి – అన్భుఅరివ్‌
స్టంట్స్‌- క‌ణ‌ల్ క‌న్న‌న్‌
నిర్మాత – సూర్య‌
స‌హ‌నిర్మాత – రాజ‌శేఖ‌ర్ క‌ర్పూర సుంద‌ర పాండియ‌న్
బ్యాన‌ర్ – 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్

- Advertisement -