ప్రాజెక్టు ‘కె’లో మరో బాలీవుడ్ బ్యూటీ!

87
disha
- Advertisement -

ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్, లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ బచ్చన్, స్టన్నింగ్‌ బ్యూటీ దీపికా పదుకొనె, విజనరీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్ర‌ఖ్యాత‌ నిర్మాణసంస్థ వైజయంతీ మూవీస్‌ కలిసి ఓ భారీ బడ్జెట్‌ సినిమాను తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట కే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటివరకు అప్‌డేట్స్ ఇస్తు వచ్చిన మేకర్స్ తాజాగా ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చే వార్తను అందించారు.

అందాల భామ దిశా పటానీ ప్రాజెక్టు కెలో జాయిన్ అయింది. దీనిపై మేకర్స్ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కానీ, వైజయంతీ మూవీస్ తనకు ఇచ్చిన గిఫ్ట్ ఫోటోను దిశా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇందులో ప్రాజెక్ట్ కే సినిమాలో భాగమైన నిన్ను చిత్రబృందం సాదరంగా ఆహ్వానిస్తోంది. నువ్వు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం త్రిల్లింగ్‌గా ఉంది తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోండగా షూటింగ్‌ సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు ప్రభాస్. ప్రభాస్, ఓ బాలీవుడ్‌ యాక్టర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 2023లో విడుదల కానున్న ఈ హై-ఆన్ VFX చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తుండగా, డాని శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

- Advertisement -